Reading Time: < 1 minute
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

ఇండోనేషియా దేశంలో పర్యటించడానికి వెళ్లిన నలుగురు టూరిస్టులు పాడు బుద్ధి చూపించారు. హోటల్ గదిలోని వస్తువుల్ని దోచేసి పారిపోవడానికి ప్రయత్నించారు. హోటల్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద సంఖ్యలో వస్తువులు బయటపడ్డాయి. ది బాలి టైమ్స్ పత్రిక వివరాల ప్రకారం.. భారత దేశానికి చెందిన నలుగురు టూరిస్టులు ఏప్రిల్ 16వ తేదీన బాలిలోని అస్వర రిసార్ట్ లో రూము తీసుకున్నారు. ఏప్రిల్ 19వ తేదీన రూము ఖాళీ చేశారు. వారు వెళ్లడానికి సిద్ధం అవుతుండగా హోటల్ సిబ్బంది వారు ఉన్న గదిని చెక్ చేశారు. గదిలో చాలా వస్తువులు మిస్ అయినట్లు అర్థమైంది. దాంతో నలుగురు టూరిస్టుల బ్యాగులను చెక్ చేశారు. వారి బ్యాగులలో టవళ్లు, హెయిర్ డ్రయర్‌లు, డోర్ మ్యాట్లు, టీవీ రిమోట్ బాక్సులు, ఆహారం తినే పాత్రలు బయటపడ్డాయి. హోటల్ యజమాన్యం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వారి నుంచి ఒక్కరూపాయి కూడా ఎక్కువగా తీసుకోలేదు. తరుణ్ గౌతమ్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది ఎంతో అవమానకరం’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోలో హోటల్ సిబ్బంది వస్తువులను బయటకు తీస్తుండగా, పర్యాటకులు సిబ్బందితో వాదించడం కనిపించింది. ఈ దొంగతన వ్యవహారంపై హోటల్ యాజమాన్యం పెద్దమనసుతో ఆలోచించింది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జరిగిన విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపింది. గదిలో దొంగిలించిన వస్తువులను పర్యాటకులు తిరిగి ఇచ్చేశారు. దీంతో యాజమాన్యం వాళ్లని బయటికి వెళ్లనిచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల అమెరికాలో కూడా ఓ మాల్‌లో ఓ భారతీయ మహిళ వస్తువులు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్

అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు

మోమోస్‌ తిన్న బాలికకులివర్‌ డ్యామేజ్.. చివరకు..!

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే