Reading Time: < 1 minute
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

కర్ణాటకకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శివ కుమార్.. అధికారిక పని నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో ఆయన మొబైల్ చోరీ అయింది. వెంటనే చిలకలగూడ పోలీసులను ఆశ్రయించగా.. అక్కడి సిబ్బంది “తర్వాత రండి” అంటూ సమాధానం ఇచ్చారు. దాంతో శివ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. తన దగ్గరున్న మరో ఫోన్‌కు, పోగొట్టుకున్న ఫోన్‌కు ఒకే ఈమెయిల్ ఐడి అనుసంధానమై ఉండటంతో ‘ట్రాకింగ్’ ఫీచర్‌ను ఉపయోగించారు. ఫోన్ లొకేషన్ మెహదీపట్నంలో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడి పోలీసులు ఒక బీట్ కానిస్టేబుల్ నంబర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీరా ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. సమయం మించిపోతోందని గ్రహించిన శివ కుమార్.. ఒంటరిగానే లొకేషన్ ఆధారంగా టిప్పు ఖాన్ బ్రిడ్జ్‌ కు చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులు అతన్ని చూడగానే పారిపోవడానికి యత్నించారు. అయినప్పటికీ ధైర్యంతో వెంబడించిన శివ కుమార్ ఒక నిందితుడిని పట్టుకున్నారు. పెనుగులాటలో నిందితుడు పారిపోయినప్పటికీ బ్యాగును అక్కడే వదిలేశాడు. ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా శివ కుమార్ ఫోన్‌తో పాటు మరో 10 చోరీ అయిన ఫోన్లు లభించాయి. అవన్నీ వరుసగా రింగ్ అవుతూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని శివ కుమార్ స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి వేదనను విన్న కమిషనర్ విచారణకు ఆదేశించారు. చిలకలగూడ, మెహదీపట్నం పోలీస్ స్టేషన్లకు చెందిన ఐదుగురు పోలీసులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. సామాన్యుడైనా ఎంతో ధైర్యంతో ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకున్న శివ కుమార్‌ను కమిషనర్ సత్కరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్

అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు