Reading Time: < 1 minute

RCBలో ఉద్యోగాల భర్తీ: బీకామ్, బీటెక్ అర్హతతో అడ్మిన్ & అకౌంట్స్ పోస్టులు

Caption of Image.

రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్​సీబీ) సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ప్రాజెక్ట్/ గ్రాంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

ఖాళీలు: సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్/ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ 1, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ.కాం/ బీబీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎం.టెక్/ ఎంఎస్సీ/ బి.టెక్, గ్రాడ్యుయేషన్  పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మే 20. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు  వెబ్‌సైట్ rcb.res.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.