తెలుగు సినీ పరిశ్రమలోని ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఇది. కేవలం ఒక చిన్న సహాయం ఎలా ఒక పెద్ద సినిమా నిర్మాణానికి దారితీసిందో వివరిస్తుంది. ఈ కథ ప్రఖ్యాత దర్శకుడు కృష్ణవంశీ, ఆయనకు కష్టకాలంలో భోజనం నటుడు బ్రహ్మజీ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తుంది.
బ్రహ్మజీ వివరించిన దాని ప్రకారం, కృష్ణవంశీ తన కెరీర్ ప్రారంభ దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో, తాను కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ, తనకు ఇంటి నుంచి వచ్చిన డబ్బుతో వంశీకి సహాయం చేయాలనుకున్నాడు. కృష్ణవంశీ బాగా చదువుకున్న వ్యక్తి. ఎంఏ పూర్తి చేశార. కానీ దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారు. అయితే, ఆయనకు తినడానికి కూడా డబ్బుల్లేవు. అప్పటికి అన్నం తిని మూడు రోజులు అవుతుంది. ఆ రోజు రాత్రి 8:30 గంటల సమయంలో, పాండీ బజార్‌లోని సుప్రియా మెస్‌లో మంత్లీ టికెట్ ఉన్న బ్రహ్మజీ, పాత పరిచయంతో కనిపించిన వంశీని కూడా భోజనానికి ఆహ్వానించారు.
కృష్ణవంశీ తొలుత మొహమాట పడినప్పటికీ.. బ్రహ్మజీ బలవంతం చేయడంతో వెళ్లి భోజనం చేశారు. కృష్ణవంశీ ఆ భోజనాన్ని ఎప్పటికీ మర్చిపోలేదని, దానిని ఒక రుణంగా భావించారని బ్రహ్మజీ గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, నిన్నే పెళ్లాడతా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, కృష్ణవంశీ బ్రహ్మజీతో “ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నువ్వు దేవుణ్ణి కోరుకో. హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. రుణం తీర్చుకోవాలి” అని అన్నారు.
బ్రహ్మజీ “గులాబీ, నిన్నే పెళ్లాడతా సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చావ్” కదా అని చెప్పగా.. కాదు నిన్ను హీరోని చేస్తా అంటూ సింధూరం చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చారు. కృష్ణవంశీ భోజనం పెట్టిన విషయాన్ని రుణంగానే భావించి.. ఆ రుణం తీసుకున్నారు. నిన్నే పెళ్లాడతా పెద్ద విజయం సాధించిన తర్వాత, కృష్ణవంశీ సింధూరం సినిమాతో తన మాటను నిలబెట్టుకున్నారు.
ఈ సంఘటన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారు, ఒక చిన్న సహాయం జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో తెలియజేస్తుంది. ఈ స్ఫూర్తిదాయక కథ మానవ సంబంధాల విలువను, కృతజ్ఞత శక్తిని చాటి చెబుతుంది.




