Reading Time: < 1 minute
Daily Horoscope Today Zodiac Predictions For Tuesday Which Sign Needs To Be Careful

12 Zodiac Predictions on June 9 2026: ఈ రోజు ఏ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది?, ఏ రాశి వారు ధన విషయాలలో, మాటల విషయాలలో జాగ్రత్త వహించాలి?, ఏ దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారు ఈ రోజు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేని పక్షంలో నిరాశ నిస్పృహలు ఏర్పడే ఆస్కారం ఉంది. కుటుంబ పరంగా మాటల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పనుల నిర్వహణలో అప్రమత్తత అవసరం. అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి వారు. చేయవలసిన పూజ.. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి.

వృషభ రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యతిరేకతలు పెరగకుండా, అనవసరమైన గొడవలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో ఉదారంగా వ్యవహరిస్తారు. మీకు అనుకూలించే దైవం.. మహాలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు అందించబడ్డాయి.