Reading Time: < 1 minute
గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో  మాట్లాడవచ్చు

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన నావిగేషన్ యాప్ ‘గూగుల్ మ్యాప్స్‌’లో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద మార్పును చేపట్టింది. సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ‘జెమిని’ని మ్యాప్స్‌లో విలీనం చేస్తూ, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ఈ విప్లవాత్మక ఫీచర్లను ప్రకటించారు. కొత్తగా పరిచయం చేసిన ‘Ask Maps’ ఫీచర్‌తో యూజర్లు ఇకపై మ్యాప్స్‌ను నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, “దగ్గరలో రద్దీ లేని పబ్లిక్ బాత్రూమ్ ఎక్కడ ఉంది? , ఎక్కువసేపు లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేని ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది?” ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు జెమిని ఏఐ తక్షణమే సమాధానాలు ఇస్తుంది. ఒక వ్యక్తిగత సహాయకుడిలా ఇది మీకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని సంభాషణ రూపంలో అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం భారత్ , అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మ్యాప్స్ రూపురేఖలను మార్చేస్తూ ‘Immersive Navigation’ ఫీచర్‌ను కూడా గూగుల్ తీసుకొచ్చింది. నావిగేషన్ సమయంలో ఇకపై రోడ్లు, 3D భవనాలు, పచ్చదనం , రంగులు వాస్తవిక ప్రపంచాన్ని తలపించేలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు దారి విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఫీచర్ త్వరలోనే కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది. నావిగేషన్‌ను కేవలం దారి చూపడమే కాకుండా, ఒక ఇంటరాక్టివ్ అనుభవంగా మార్చడమే లక్ష్యంగా గూగుల్ ఈ అప్‌గ్రేడ్స్ చేపట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో ‘క్లోజ్డ్’బోర్డ్స్

ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..

పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!