మిథున రాశి : మిథున రాశి వారికి మే నెల మొత్తం అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. అంతే కాకుండా విదేశీ ప్రయాణం చేసే వారికి కూడా ఇది అనుకూల సమయం అని చెప్పాలి. ప్రయాణాలు ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి మే నెల మొత్తం ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు అత్యధికంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి పురోగతి లభిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి వారు మే నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటిలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఈ రాశి వారు వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. డబ్బు చేతికి అందడంతో ఈ రాశి వారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. అలాగే ఆదాయం పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు పొందుతారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




