పెసరపప్పు కోయగూరకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , రెండు పెద్ద కట్టలు తోటకూర, రెండు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాట , మూడు పచ్చి మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం,
రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, మూడు ఎండు మిర్చిని తీసుకోవాలి.
పెసరపప్పును ఇలా ఉడికించుకోవాలి: ముందుగా మంచి పెసరపప్పును తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి 20 నిమిషాల పాటు వాటిని బాగా నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, దానిలో రెండు గ్లాసుల నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ అది వేడయ్యాక దానిలో చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించండి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.
ఈ మిశ్రమం బాగా ఉడికిన తరవాత టమాటాలు కూడా దీనిలో వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి వీటిని బాగా ఉడికించుకోవాలి.
ఆ తర్వాత ముందుగా కడిగిపెట్టుకున్న కోయగూరను వేసి పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత
పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయడమే.
పాతకాలంలో ఈ పెసరపప్పు కోయగూరను బాగా తినేవాళ్లు. దీనిని తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయమవుతాయి. అయితే, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యున్ని సంప్రదించి తినాలి. ఎందుకంటే, ఇది కొందరికి పడదు. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)




