
వేసవి వచ్చిందంటే చాలా మంది మామిడికాయ నిలువ పశ్చళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అదే పచ్చిమామిడి కాయలతో రైతాను కూడా చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును పచ్చి మామిడి, పెరుగుతో మనం ఎంతో రుచికరమైన రైతాను తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. పచ్చి మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, అలాగే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. కాబట్టి పచ్చి మామిడి రైతాను ఎలా తయారు చేయాలో, దానికి ఏ పదార్థాలు అవసరమో తెలుసుకుందాం.
పచ్చిమామిడి రైతాకు కావలసిన పదార్థాలు
- 1 పచ్చి మామిడికాయ
- 1.5 కప్పుల పెరుగు
- ½ టీస్పూన్ కారం పొడి
- ½ టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- ½ టీస్పూన్ ఆవాలు
- 8-10 కరివేపాకు ఆకులు
- 1 చిటికెడు ఇంగువ
- 1 టీస్పూన్ నూనె
- రుచికి సరిపడా ఉప్పు
పచ్చిమామిడి రైతా తయారీ విధానం
- ముందుగా పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీయాలి. ఆ తర్వాత దాన్ని సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలకాలి. ఇందులో తురిమి పెట్టుకున్న మామిడికాయను వేసి కలపాలి.
- ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి
- తర్వాత ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి
- ఈ తాలింపును రైతాలో వేసి కలిపుకుంటే మీ పశ్చిమామి రైతా రెడీ అయినట్టే. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరిస్తే మరింత రుచిగా ఉంటుంది.
- ఈ రాయితా పప్పు-అన్నం లేదా వేడివేడి పరోటాలతో కలిపి తింటే చాలా బాగుంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.