Reading Time: < 1 minute

Vastu Tips: ఇంటికి రెండు వైపులా మెట్లు ఉంటే నష్టం జరుగుతుందా.. ఆఫీస్ రూం ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి

Caption of Image.

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణం .. మెట్లు ఏ దిశలో ఉండాలి.  ఇంటికి రెండు దిక్కులో  మెట్లు ఉంటే నష్టం జరుగుతుంది.  ఇంట్లొనే ఆఫీసు రూం పెట్టుకోవాలంటే ఏ దిక్కులో ఉన్న గదులను వాడుకోవాలి. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం..

ప్రశ్న:  తూర్పు ముఖద్వారంతో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంటికి రెండువైపులా మెట్లు కట్టుకోవచ్చా? ఏ వైపు ఉంటే బాగుంటుంది?

జవాబు:ఇంటికి రెండు వైపులా మెట్లు కట్టుకోవచ్చు. ఆగ్నేయం, వాయువ్యం.. రెండు దిక్కుల్లో మెట్లు కట్టుకోవాలి. ఉత్తరం నుంచి దక్షిణంవైపు చూస్తూ మెట్లు ఎక్కాలి. లేదా తూర్పు నుంచి పడమరవైపు చూస్తూ మెట్లు ఎక్కాలని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.

ప్రశ్న:  కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లోనే ఆఫీస్ కోసం ఒక గది వాడుకోవాలనుకుంటున్నాం. ఉత్తర ఈశాన్యం, ఆగ్నేయం దిక్కుల్లో గదులు ఉన్నాయి. వాటిలో ఏవైపు గదిని ఆఫీస్ గా వాడుకుంటే బెటర్? లేదా వేరే ఏ గదినైనా ఆఫీస్ గా మార్చుకోవచ్చా?

జవాబు: రెండు రూమ్​ లు ఖాళీగా ఉన్నప్పుడు ఆగ్నేయ రూమ్ ను ఆఫీస్ గా వాడుకోవచ్చు. ఒకవేళ ఈశాన్యం రూమ్ వాడుకోవాలనుకుంటే, ఆగ్నేయ రూమ్ ఖాళీగా ఉంచకూడదు. అప్పుడు రెండు రూమ్​లు ఆఫీస్​ గా వాడుకోవాలని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.