
- గోకవరంలో నిరాహార దీక్ష
- పంట వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
ఖమ్మం/ బూర్గంపహాడ్/ కల్లూరు, వెలుగు : పంటలు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మార్కెట్‌యార్డులో మూడు రోజుల కింద పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా, ఒకే రోజు కొనుగోళ్లు చేసి నిలిపివేయడంతో శుక్రవారం అన్నదాతలు ఆందోళనకు చేపట్టారు. రైతు వేదికలో వ్యవసాయాధికారి శంకర్, పీఏసీఎస్ఆఫీసర్లను ఉంచి తలుపులు వేసి నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోకవరం జీపీ పరిధిలోని ఎర్రబంజర గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గోకవరం సర్పంచ్ గూగులోతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ధాన్యాన్ని ఆరబెట్టి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ పంట కొనుగోలు చేస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని, పూర్తిస్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని మహాధర్నా నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.