Reading Time: < 1 minute
Gurugram Man Dies After Sex Enhancing Drug Overdose

Shocking: హర్యానా గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సె*క్స్ సామర్థ్యాలను పెంచే మందుల్ని తీసుకున్న తర్వాత 29 ఏళ్ల యువకుడు మరణించాడు. హైడోస్ తీసుకోవడం వల్లే గుండెపోటుతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Read Also: Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..

మృతుడిని రోహిత్ లాల్‌గా గుర్తించారు. నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. గురుగ్రామ్ సెక్టార్-53 ప్రాంతంలో ఒక పీజీ గదిలో నివసిస్తున్నాడు. గురువారం ఉదయం అతడి సహోద్యోగి ఫోన్ చేసినా స్పందించలేదు. వీరిద్దరు కలిసి ఆఫీస్‌కు వెళ్తుంటారు. ఇంటి వద్దకు వెళ్లినా తలుపు తెరవలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, డోర్ పగలగొట్టి చూడగా, రోుహిత్ మరణించి ఉన్నాడు. గదిలో కొన్ని మందులు, హెల్త్ సప్లిమెంట్స్ లభించాయి.

ప్రాథమిక విచారణలో.. రోహిత్ తనకు కాబోయే భార్యను గదికి ఆహ్వానించినట్లు తెలిసింది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మాత్రల్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండెపోటుతో మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆమె రాక ముందే రోహిత్ మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి, శరీరంలోని శాంపిళ్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెప్పారు.