
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీతో పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీతో జనం ముందుకు వచ్చారు.
మేం అధికారంలోకి అందరికీ ఉచిత విద్య
- ప్రైవేట్ స్కూళ్లలో కూడా విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య
- గురుకులాల్లో పేదలు చనిపోతున్నా సీఎం రాలేదు
- తప్పుకు క్షమాపణ చెప్తున్నా..మార్పుకోసమే రాజకీయ పార్టీ
- సామాజిక న్యాయం కోసం పనిచేస్తాం
- భద్రాచలం రామాలయం మునుగుతుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు
- ఐదు అంశాలపైనే నా పోరాటం
కవిత కీలక వ్యాఖ్యలు
- కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు
- అప్పటి టీఆర్ఎస్ కోసం రక్తం ,చెమట ధార పోశా
- ఇక్కడ పీకి కట్టలు కట్టామని ఇతర రాష్ట్రాలకు వెళల్లారు
- నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టి బజారున పడేశారు
- బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు
- కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే నన్ను బయటకు గెంటేశారు
- రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది
- కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అప్పటి కేసీఆర్ వేరు..ఇప్పటి కేసీఆర్ వేరు..
- కేసీఆర్ మరమనిషి..ఆ సార్ ఎప్పుడూ రారు..ఎందుకంటే ఆయన మారిన మనిషి
- కేసీఆర్ మన మనిషి కాదు..గుంటనక్క చేతిలో బందీ అయిపోయిండు
- మన కేసీఆర్ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేవారు
- కవిత కామెంట్స్
- బతుకమ్మ వచ్చిన తర్వాత మన సంస్కృతి మనకు తెలిసింది..
- బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం
- పదేళ్లు పాలించిన కుటుంబంలో నేను భాగస్వామ్యంగా ఉన్నా
- జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికే మీ ముందుకు వచ్చా
- బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది
- పదేళ్లు దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది
- నేరెళ్ల దళితుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి
- మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డలకు అమ్మగా పనిచేస్తా
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు బేడీలు పడ్డాయి
- ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరు తిరిగా
- తెలంగాణ జాగృతి కాంతి రేఖగా పనిచేసింది
- నాకు సింగరేణి అంటే ఇష్టం
- ఉద్యమంలో జాగృతి సంస్కృతికి పునాదులు పడ్డాయి
- తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది
- తెలంగాణ ఉద్యమ కల నెరవేరలేదు
- పదేళ్ల తెలంగాణ దారి తప్పింది
- పదేళ్లు జరిగిన తప్పిదాల్లో నాకు భాగస్వామ్యం ఉంది
- కవిత TRS పార్టీ జెండాలో పసుపు, నీలం, తెలుపు రంగులు
- కవిత ప్రకటించిన టీఆర్ఎస్.. TRS.. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ జెండా విడుదల అయ్యింది.
- TRS జెండాలో మూడు రంగులు ఉన్నాయి.
- పసుపు, నీలం. తెలుపు రంగులు
- పసుపు రంగులో జెండా మొత్తం ఉంటే.. అందులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ నీలం రంగులో ఉంది
- TRS అనే అక్షరాలు తెలుపు రంగులో ఉన్నాయి.
- TRS.. తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు.
- TRS.. అనేది ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాత పేరు..
- తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ ప్రారంభించిన పార్టీ. ఈ పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమం నడిపించారు కేసీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్లు ఈ పార్టీ పేరుతో కేసీఆర్ రాజకీయం చేశారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు టీఆర్ఎస్ పేరును.. భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్.
- ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత.. అప్పట్లో తండ్రి ప్రారంభించి.. వదిలేసిన టీఆర్ఎస్ పేరుతోనే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టటం విశేషం.
- కాకపోతే.. అప్పట్లో టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి..
- ఇప్పుడు కవిత టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సేన..
- మారింది జస్ట్.. సమితి ప్లేస్ లో సేన వచ్చింది.. మిగతాది అంతా సేమ్ టూ సేమ్..
- తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా నామకరణం
- కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించిన కవిత
- ఆవిర్భావ సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంగా పేరు
- మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ వేదికకు చేరుకున్న కవిత.
-
-
కవిత సర్వోదయ తెలంగాణ నినాదం ఇదే
- సర్వోదయ తెలంగాణే తన పార్టీ లక్ష్యమని కవిత ప్రకటించారు. సర్వోదయ తెలంగాణ ద్వారా సమాజంలోని అట్టడుగు వ్యక్తి సహా అందరి సంక్షేమం, సమానత్వం, అహింస, స్వయంసమృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. సర్వోదయ సిద్ధాంతం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావచ్చని గాంధేయవాదులు నమ్ముతారు. కవిత కూడా గాంధీ ఆచరించిన సర్వోదయ సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకుని సర్వోదయ తెలంగాణే లక్ష్యంగా తన పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు.
- అంటే.. తెలంగాణలో కూడా అట్టడుగు వ్యక్తి సహా అందరి సంక్షేమం అందాలని, స్వయంసమృద్ధి సాధించాలనేది ఆమె ప్రధాన ఉద్దేశం. ఎవరెంతో వారికి అంతే.. అంటే జనాభాలో ఎంత శాతం ఉంటే అంత వాటా (రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో) దక్కాలనేది ఆమె ఉద్దేశం.
- కవిత గన్ పార్క్ దగ్గర అమర వీరులకు నివాళులర్పించారు కవిత. భారీ ఎత్తున తరలివచ్చిన జాగృతి కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ చేరుకున్న కవిత అమర వీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్ తో మునీరాబాద్ సభకు బయల్దేరారు.
- పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కవిత అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ జెండా, ఎజెండా సహా ప్రతి అంశంపై నిపుణులతో చర్చలు జరిపారు. ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలో ఇటు రాజకీయ విశ్లేషకులతోనూ సమాలోచనలు జరిపారు. పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తోనూ చర్చలు జరిపారు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, పార్టీ ఎజెండా ఏముండాలి.. వంటి అంశాలపై పీకేతో ఆమె చర్చించారు.
- ఆ మీటింగ్తర్వాతే జాగృతిలోనే కొన్ని టీములు వేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎజెండా రూపకల్పన చేశారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ జెండాలో ‘నీలి’ రంగును ఖరారు చేశారు. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని ఆమె చెప్పినా.. ఆ పేరు వచ్చే చాన్స్ లేదని భావించి కొత్త పేరును ఖరారు చేసినట్టు జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
- బీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొని.. టికెట్లు దక్కని సీనియర్ నేతలపై కవిత దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు జాగృతిలో చేరారు. అదే బాటలో మరిన్ని చేరికలు ఉంటాయని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలో కొందరు సీనియర్ నాయకులతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందని తేల్చి చెప్పారు.