
Virat Kohli: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగియగానే విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో నిలబడి స్టాండ్స్ వైపు చూస్తూ తన భార్య అనుష్క శర్మ ఎక్కడుందో అని వెతుకుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. కాగా స్టేడియంలోని వేలది మంది జనం మధ్య తన కోసం వెతుకుతున్న విరాట్‌ను చూసి అనుష్క చిరునవ్వుతో స్పందించడం, ఆమె ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లీ సిక్సర్లు బాదినప్పుడు ఆమె ఇచ్చిన రియాక్షన్స్ అభిమానుల మనసు గెలుచుకున్నాయి.
కాగా ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, ఈ మ్యాచులో సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీ (100 పరుగులు) బాదాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (47 ఇన్నింగ్స్‌ల్లో) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 81 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరపున 800 ఫోర్లు, 300 సిక్సర్లు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక దేవదత్ పడిక్కల్ సైతం 27 బంతుల్లో 55 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది చివరి లీగ్ మ్యాచ్.. ఈ విజయం తర్వాత ఆర్‌సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Match ends and Virat Kohli instantly turns into “where’s Anushka?” mode. She’s so lucky to have him ❤️ pic.twitter.com/k2uvbUNbhY
— ` (@8eenpoint5) April 25, 2026