
సైఫాబాద్, వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) తన ప్రతిష్టాత్మక ‘ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ను ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో అవార్డుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మొత్తం 21 విభాగాల్లో (పరిశ్రమ, ఆవిష్కరణ, వ్యక్తిగత ప్రతిభ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్, మహిళా పారిశ్రామికవేత్తలు, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు దక్కనున్నాయి. జస్టిస్ చల్లా కోదండ రామ్ నేతృత్వంలోని స్వతంత్ర జ్యూరీ పారదర్శకంగా విజేతలను ఎంపిక చేస్తుందని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్.రవి కుమార్ తెలిపారు.
ఆసక్తి గల సంస్థలు, వ్యక్తులు మే 10వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి, కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ కంకారియా తదితరులు పాల్గొన్నారు.