మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాహువు, రవి, శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సకాలంలో పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా ఉత్సా హం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధ, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దూరపు బంధు వుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దశమ స్థానంలో శని, బుధులు, లాభ స్థానంలో రవి అనుకూల సంచారం వల్ల మనసులోని కోరికలు, ఆశయాలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త ప్రాజెక్టులతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ది చెందుతుంది. బంధువుల సొంత విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ద పెట్టడం అవసరం. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడు, దశమంలో ఉచ్ఛ స్థితిలో రవి ఉన్న కారణంగా అన్ని ముఖ్యమైన విషయాల్లోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులకు ఆర్థిక విషయాల్లో అండగా నిలబడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): భాగ్య స్థానంలో రవి, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు ప్రాధాన్యం పెరగడంతోపాటు బాధ్యతలు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆస్తి వ్యవహారాలు కాస్తంత నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగపరంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండి గురువుతో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గరవుతారు. కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. పరిచయస్థులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నూతన వస్తు లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనల్ని అమలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం, సఖ్యత పెరుగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, బుధ, శనీశ్వరుల అనుకూల సంచారం కారణంగా వారంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ పని తలపెట్టినా సజావుగా, సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతికి బాగా అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తిలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధుమిత్రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆశించిన శుభ వార్తలు వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలోముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): దశమాధిపతి రవి ఆరవ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరిగి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు, ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులకు స్తోమతకు మించి సహాయపడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో, పంచమంలో రవి ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొందరు సన్నిహితుల నుంచి కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ప్రధాన గ్రహాలైన శని, శుక్ర, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ప్రముఖుల నుంచి గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతల్ని అప్పగిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, బుధ, రవుల బలం బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, ఈ రాశ్యధిపతి శని ధన స్థానంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. సొంత పనులను పూర్తి చేయడం మీద, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద ఎక్కు వగా శ్రద్ధ పెట్టడం మంచిది. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన శుభవార్త ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కుజ, బుధ, శుక్రుల అనుకూలతవల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు అందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు బాగా కష్ట పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.











