
సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ గ్రూప్ నిర్వహించిన సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026లో బెస్ట్ ఆయుష్/ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ విభాగంలో సెల్ హెల్త్ క్లినిక్ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఈ అవార్డును క్లినిక్ అధినేత డాక్టర్ రవి కుమార్ చింత, ప్రఖ్యాత నటి జయప్రద చేతుల మీదుగా స్వీకరించారు. నేచురోపతి విధానాన్ని అనుసరిస్తూ, వ్యాధుల మూల కారణాలను గుర్తించి చికిత్స అందించడంలో Cell Health Clinic ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డు క్లినిక్‌కు మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు అలాగే త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.