Reading Time: 2 minutes

25 వేలలో మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ కావాలా: ఒప్పో, వివో నుండి రెడ్‌మి వరకు క్రేజీ ఫోన్స్ ఇవే…

Caption of Image.

మీరు రూ. 25,000 లోపు మంచి ఫోన్ కోసం చూస్తున్నారా..?  లేదా 2026లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ రేంజ్లో   అద్భుతమైన బెస్ట్  ఫీచర్స్ ఉన్న ఫోన్స్ పుష్కలంగా ఉన్నాయి. మీరు 5G, పెద్ద బ్యాటరీలు, 120Hz స్మూత్ స్క్రీన్‌, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఫోన్స్  చూడొచ్చు. వీటిలో వివో T5x 5G, రెడ్‌మి నోట్ 15 SE 5G, ఒప్పో K14 5G వంటివి కొన్ని ప్రముఖ మోడళ్లతో సహా హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలాగే  కనిపించే,  చాలా తక్కువ ధర స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి.

వివో టి5ఎక్స్ 5జి
దీని ధర చూస్తే సుమారు రూ. 18,999 నుండి రూ. 25,000  వరకు ఉంటుంది. ముఖ్య ఫీచర్లలో 120Hz డిస్‌ప్లే, భారీ 7200mAh బ్యాటరీ, 5G,  పవర్ ఫుల్  చిప్‌సెట్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, స్మూత్ పర్ఫారెన్స్ తో అన్ని విధాలా మంచి ఛాయిస్ ఫోన్. ప్రతిరోజు వాడుకకి సరైనది ఇంకా మీ పనులను చాలా సున్నితంగా నిర్వహిస్తుంది.

రెడ్‌మి నోట్ 15 SE 5G
దీని ధర సుమారు రూ. 19,999 నుండి ఉంటుంది.  ఇక ముఖ్యమైన  ఫీచర్లలో  స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 5800mAh బ్యాటరీ, 5G,  స్ట్రాంగ్ డిస్‌ప్లేతో మీ డబ్బుకు బెస్ట్  వాల్యూ ఫోన్. మీ బడ్జెట్‌కు అనుకూలంగా, స్పీడ్, బ్యాటరీల మధ్య గొప్ప బ్యాలెన్స్ కావాలనుకుంటే, ఇది ఒక గొప్ప అప్షన్.

ఒప్పో K14 5G
దీని ధర సుమారు రూ. 21,999 నుండి రూ. 23,999 వరకు ఉంటుంది. దీని ఫీచర్లలో 120Hz డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 5G, ఆండ్రాయిడ్ 15, బలమైన బ్యాటరీ + స్టైలిష్ డిజైన్,  మీరు ఎక్కువగా వాడేవారైతే ఈ ఫోన్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది, ఎందుకంటే దీనికి పెద్ద  బ్యాటరీ, చాలా స్మూత్ స్క్రీన్ ఇచ్చారు. 

టెక్నో స్పార్క్ 50 5G
దీని ధర సుమారు రూ.16,999 నుండి రూ.18,999 ఉంటుంది.  ఫీచర్లు చూస్తే 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 5Gతో  ఎందుకు కొనాలంటే  ఇంత తక్కువ ధరలో చాల ఫీచర్లు అందిస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా లేటెస్ట్  ఫోన్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అప్షన్.

వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్
దీని ధర  సుమారు రూ. 23,999 ఉంటుంది. ఫీచర్లు చూస్తే  క్లీన్ UI, స్మూత్ పెర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్ తో ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవం మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మినిమల్, క్లీన్ లుక్‌ను మీరు ఇష్టపడి, రాబోయే ఏళ్ల పాటు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకుంటే, ఈ ఫోన్ మీ కోసమే.

©️ VIL Media Pvt Ltd.