Reading Time: < 1 minute
Iran Ceasefire Israel Silence Middle East Tensions Oil Prices Hormuz

ఇజ్రాయెల్‌పై దాడి చేయబోమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ వెల్లడించింది. అయితే ఇరాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడులను ఆపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలను కోరారు. కొద్దిసేపటికే ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేసిందని ఇరాన్ మీడియా నివేదించింది. తమ ప్రతీకారం పూర్తయిందని.. అయితే లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్‌ను ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రకటనపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ స్పందించలేదు.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దక్షిణ బీరూట్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలోనే టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇలా ఇరు దేశాలు ప్రతీకార దాడులు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దాడులు ఆపుతుందా? లేదా అనేది ఇంకా తెలియలేదు.

తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం తిరిగి ముదిరే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో రవాణా అంతరాయాలు కొనసాగుతుండటంతో ఇంధనం, వస్తువుల సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రకటించిన కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది? ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.