
బుద్ధ పూర్ణిమ.. వైశాఖ పౌర్ణమి.. ఈ పర్వదినానికి మనదేశంలో ఎంతో విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే1 న అంటే శుక్రవారం రోజున బుద్ధ జరుపుకోనున్నాం. ఈ రోజు బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి ఈ రోజు బౌద్ధులకు ఎందుకు అంత ప్రత్యేకమైన రోజో ఇప్పుడు తెలుసుకుందాం.
బౌద్ధ మతం స్థాపకుడైన బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. అతను వైశాఖ మాసంలో పూర్ణిమ తిథి (పౌర్ణమి రాత్రి) లో లుంబినిలో కులీన శాక్య వంశానికి చెందిన సుద్దోదన మహరాజు, రాణి మాయదేవికి జన్మించాడు. యాదృచ్ఛికంగా చాలా రోజుల తరువాత సిద్ధార్థుడికి జ్ఞానోదయం పొందాడు. బోధగయలో రావిచెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదంయ పొందాడు.
గౌతమ బుద్ధుడు బోధ గయలో జ్ఞానోదయం అనంతరం తన మొదటి బోధన సారనాథ్ లో ఇచ్చాడనే సంగతి అందరికి తెలిసిందే. బోధగయ నుంచి 5 వారాల పాటు సారనాథ్ కు ప్రయాణం సాగించి అక్కడ తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చాడు. మొదటి బోధనను గురుపూర్ణిమ రోజే బుద్ధుడు తన శిష్యులకు బోధించాడు.
బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని… అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.
భాగవత పురాణంలో వివరించబడిన వివరాల ప్రకారం ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరించాడు.
మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
వైశాఖ పూర్ణిమ… దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ.. బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది.
బుద్ధుని ఉపదేశంలో గొప్ప సత్యాలున్నాయి. అవి.. లోకం దుఃఖమయం, దుఃఖానికి మూలం కోరిక, కోరికను నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా కోరికలను నివారించవచ్చన్నాడు. అష్టాంగ మార్గంలో సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన సాధన, సరైన స్మృతి, సరైన ధ్యానం వంటి ఎనిమిది శాస్త్రీయ పరిష్కారాలు చూపాడు. వీటిని చక్కగా ఆచరించడం ద్వారా ప్రశాంతత, శాంతి లభిస్తుంది. ఇవీ నేటి సమాజంలో కూడా ఆచరణీయమైనవి. మానవ విలువలు కలిగిన బౌద్ధం.. అశోకుడు వంటి గొప్ప రాజుల ఆదరణకు నోచుకొన్నది. దీంతో సామాన్య జనులకు దగ్గరైంది. బుద్ధుడు సరళమైన తాత్వికత, ఆచరణాత్మక విధానాలు భారతదేశంతోపాటు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి.