Reading Time: < 1 minute
Ram Charan Peddi Trailer Launch Mumbai Ar Rahman Bhopal Concert

Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు ప్రమోషన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా, ఇప్పటికే గ్లింప్సెస్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇప్పుడు సినిమా యూనిట్ ఈ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా భారీ పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. లాన్ ఇండియా లెవల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా, మే 18న ముంబైలో ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌ను, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌ను ప్రతిబింబించేలా ఈ ట్రైలర్ ఉండబోతోందని సమాచారం.

జాతీయ మీడియా సమక్షంలో జరిగే ఈ ఈవెంట్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ‘పెద్ది’ ఫీవర్ మొదలుకానుంది. ట్రైలర్ లాంచ్ తర్వాత చిత్ర బృందం ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలిచే భోపాల్‌కు పయనం కానుంది. మే 23న అక్కడ నిర్వహించనున్న స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఈ చిత్ర ప్రమోషన్లలోనే హైలైట్‌గా నిలవనుంది. స్వయంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందిన సాంగ్స్, ప్రముఖ గాయకులతో కలిసి ఆయన లైవ్‌లో ఆలపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ సాంగ్స్ చార్ట్‌బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.