
vivo Y600 Pro Launch: వివో (vivo) నుండి Y సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ వివో Y600 ప్రో (vivo Y600 Pro)ను చైనాలో లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన Y500 Proకి ఇది సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండగా, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు 4320Hz PWM డిమ్మింగ్ ఫీచర్ ఉండటం వల్ల విజువల్ అనుభవం మరింత మెరుగ్గా అందిస్తుంది. ఇక ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్ వస్తుంది. ఇది 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫోటోగ్రఫీ విషయంలో 50MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఇందులో 3810 mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల గేమింగ్ లేదా హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడి తగ్గుతుంది. ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది దీని భారీ 10200mAh బ్యాటరీ. దీనికి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 80 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ వలన -20°C నుంచి 40°C వరకు స్థిరంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, AI ఆధారిత ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీతో బ్యాటరీకి 6 సంవత్సరాల వరకు దీర్ఘాయువు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

దృఢత్వం పరంగా కూడా ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్స్‌తో వస్తుంది. దీని వల్ల నీరు, ధూళి నుంచి మంచి రక్షణ లభిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, NFC వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే ఈ ఫోన్ ప్రారంభ ధర 2099 యువాన్ (రూ. 28,900) నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB, 8GB+256GB, 8GB+512GB, 12GB+512GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ గోల్డ్, మూన్‌లైట్ బ్లాక్, వాస్ట్ బ్లూ, స్టారి పర్పుల్ రంగుల్లో లభ్యమవుతుంది. మే 5 నుంచి చైనాలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ సేల్‌లో 100 యువాన్ వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది.