Reading Time: < 1 minute

అమరావతి: శాఖల సమర్థత పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల నుంచి 80 శాతం నుంచి 90 శాతం తగ్గకుండా.. పబ్లిక్ పర్షెప్సన్ ఉండాలని అన్నారు. నూతన విధానాల అమలు అంశంపై పలు కీలక శాఖలతో, ఆర్ టిజిఎస్, పిపిపిపై సిఎం సమీక్ష జరిపారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న..స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెన్షన్ల విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్నచోట.. సమర్థంగా పంపిణీ జరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఆర్టిసి బస్సు సర్వీసులు బావున్నా.. ఆర్టిసి బస్ స్టేషన్ లో..సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్ లో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని, బస్ స్టేషన్ కు వచ్చిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరేవరకు.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని అన్నారు.  రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు.