Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తూ డిసిఎం వాహనాన్ని, డివైడర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సాయి, కీర్తన్ గా పోలీసులు గుర్తించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారంతా ఊపిరిపీల్చుకున్నారు.