Reading Time: < 1 minute
Rajinikanth Jailer 2 Movie Release Postponed Updates

రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ మూవీ ‘జైలర్ 2’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిల్మ్ నగర్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు షూట్ చేసిన కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని చిత్రబృందం భావిస్తోందట. దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్దే కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దీనికి ఇంకా దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇతర నటీనటుల క్యామియో రోల్స్‌కు సంబంధించిన డేట్స్, స్క్రీన్‌ప్లే సర్దుబాట్ల వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, అందుకే ఇంత ఆలస్యం జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. ఇక పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే నాణ్యత కోసం ఎంత సమయమైనా తీసుకోవాలని టీమ్ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతానికి అభిమానులు ఈ వార్త విని కొంత నిరాశ చెందుతున్నా, రజనీకాంత్‌ను మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో చూడటానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.