
హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. ప్రఫుల తొలి ఓవర్‌లోనే ముగ్గురిని డకౌట్ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనామక బౌలర్ హింగే ఒకే ఓవర్ మూడు వికెట్లు తీయడంతో సోషల్ మీడియాలో అతడి పేరు మారు మోగుతుంది. తొలి ఓవర్‌లో రెండో వైభవ్ సూర్యవంశీ, నాలుగు బంతికి ధ్రృవ్ జురెల్, ఆరో బంతికి లాండ్రే ప్రిటోరస్ ఔట్ చేసి సంచలనం సృష్టించారు.
డబ్ల్యూ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి హిండే రికార్డు సృష్టించాడు. తరువాతి ఓవర్‌లోనే రియాన్ పరాగ్ ఔట్ చేసి ఔరా అనిపించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ షిక్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిచారు. ప్రఫుల్ హింగే నాలుగు వికెట్లు తీయడంతో ఇన్‌స్టాగ్రామ్ ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగారు. ఒక్కరోజులో లక్ష మంది ఫాలోవర్స్ పెరిగారు. ఫాలోవర్స్ సంఖ్య 1723 నుంచి 101000 పెరిగింది. ఒక్కసారిగా హెంగే ఆకాశానికి ఎత్తి ప్రశంసిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ బాహుబలిని ఎక్కడ దాచి పెట్టారని నెటిజన్లు అడుతున్నారు. ప్రఫుల్ బయోలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పాటు విదర్భ క్రికెట్ అసోషియేషన్ ఉంటుంది.