Reading Time: 2 minutes

హైదరాబాద్: పోరాడితే పోయేదేంలేదని బానిస సంకెళ్లు తప్ప అన్న ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రెండున్నరేళ్లుగా అంబేద్కర్ విగ్రహాన్ని బంధించి పెట్టారని విమర్శించారు. అందరికీ 135 వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ కట్టిన విగ్రహం.. కెసిఆర్ ఆనవాళ్లని బంధించి అవమానంచిన రేవంత్ సర్కార్ ఈసారి కూడా అదేవిధంగా చేస్తే సంకెళ్లను బద్ధలు కొడతామని హెచ్చరించారు. నియంతృత్వ పొకడలు ఉన్న సిఎం రేవంత్ రెడ్డికు బుద్ధి వస్తుందని చెబుతున్నామని, బోధించు, సమీకరించు, పోరాడు అనే నానుడితే రాష్ట్ర అవశ్యకతను..అంబేద్కర్ తత్వాన్ని బోధపరిచి రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ అని కొనియాడారు.

ఆర్టికల్-3 లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని పలుమార్లు చెప్పారని, ఆనాడు వేయి గురుకులాలు పెట్టి రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతూ..విద్య అందించేలా కెసిఆర్ ప్రభుత్వం కృషి చేసిందని ప్రశంసించారు. ఇవాళ విషాహారంతో దౌర్భాగ్య పాలనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని, అంబేద్కర్ మహిళలకు సమానత్వం కల్పించి, వివక్షను పారదోలేలా బిల్లు తీసుకువచ్చారని కెటిఆర్ తెలియజేశారు. అంబేద్కర్ కు కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే భారతరత్న ఇచ్చారని, 16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలని కెసిఆర్ కృషి చేస్తే.. ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ల పేరిట అనేక హామీలు కెసిఆర్ ఇచ్చారని అన్నారు.

ఎస్సి ఎస్టి ఇండ్లకు రూ. 6 లక్షలు ఇస్తామని మభ్య పెట్టారని, ఎస్సి ఎస్టిలకు జాగాలను ఉచితంగా ఇస్తామని చెప్పారని మండిపడ్డారు. టెన్త్ పాసైతే 10, వేలు, ఇంటర్ చేస్తే రూ.15 వేలు, డిగ్రీ పూర్తయితే 25 వేలు ఇస్తామన్నారని, ఎస్టిలకు 12 శాతం, ఎస్టిలకు 18 శాతం కాంట్రాక్టులు ఇస్తామని మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. ఎస్సి, ఎస్టి, బిసిలకు 72 శాతం ప్రభుత్వ వాటా ఇచ్చారా అంటే లేదని, విదేశీ విద్య కోసం రూ. 20 లక్షల చొప్పున స్కాలర్ షిప్ లు కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చారని అన్నారు. ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రతి దళిత వాడకు.. గిరిజన గూడెంలో ప్రచారం చేసేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించకుండా.. బిసి, మైనార్టీ సబ్ ప్లాన్ అంటూ అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు