Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీలో తన చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో తన అనుబంధం ఈనాటిది కాదు అని, తాను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కెసిఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా తనకు పరిచయం ఉందని తెలియజేశారు.  తనతో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కెసిఆర్  కూడా చెబుతూ ఉంటారన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రారంభంలో కెసిఆర్ తో కలిసి పని చేశానని వివరించారు. మేడిగడ్డను సాకుగా చూపెట్టి కెసిఆర్ ను దోషిగా నిలబెట్టాలని చూశారని, కెసిఆర్ దోషి కాదు అని తెలంగాణ నిర్మాణానికి వ్యూహకర్త, స్ఫూర్తిదాత అని ప్రశంసించారు. మూడేళ్లు గడిచే సరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నారని, రేపు కరువు వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ  అవుతుందని విమర్శించారు.