Reading Time: < 1 minute

సంగారెడ్డి:  పోలీస్ వాహనం ఢీకొని ఎఎస్ఐ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మనూరు పోలీస్ స్టేషన్ లో గోవింద్ నాయాక్ అనే వ్యక్తి ఎఎస్ఐగా పని చేస్తున్నాడు.  పోలీస్ వాహనం అదుపుతప్పి గోవింద్ పైకి దూసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవింద్ దుర్మరణం చెందాడు. పోలీస్ వాహనం డ్రైవర్ రామారావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలపిారు. నిందితుడి కక్షపూరితంగానే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.