
బెంగళూరు: ఓ వివాహిత వేధింపులకు గురి చేయడంతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు ప్రాంతంలోని నెలమంగలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వాహరహళ్లి ప్రాంతంలో దిలీప్ అనే వ్యక్త జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. ఓ వివాహిత జిమ్‌లో జాయిన్ కావడంతో ఆమెకు దిలీప్ ట్రైనర్‌గా ఉన్నాడు. దీంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి పంపించారు. దీంతో ఆమెను దిలీప్ దూరం పెట్టాడు. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు మహిళ సహజీవనం చేయాలని వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని దిలీప్ తండ్రి రమేశ్ ఆరోపణలు చేశాడు.