Reading Time: < 1 minute

Hydraa: హైడ్రా కూల్చివేతలు.. అత్తాపూర్లో ఉద్రిక్తత

Caption of Image.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆదివారం (మార్చి 15) చిన్న అనంతగిరి దేవాలయం సమీపంలోని వివాదంలో ఉన్న భూమిలో రేకుల షెడ్డు, ప్రహరీ గోడలు కూల్చివేయటం ఉద్రిక్తతలకు దారి తీసింది. కూల్చి వేతలు ఆపాలని ఒక వర్గం, కూల్చేయాల్సిందేనని మరో వర్గం పట్టుబడట్టడంతో ఆందోళనకరమైన వాతావరణానికి దారి తీసింది. 

చిన్న అనంతగిరి దేవాలయం సమీపంలోని  భూవివాదంలో గతంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని గతంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలించారు. గత రెండు రోజుల క్రితం ఈ ల్యాండ్ విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇరు వర్గాలతో రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

ఆదివారం ఉదయం రంగంలోకి దిగిన హైడ్రాధికారులు ఒక వర్గం వారు వేసిన రేకుల ప్రహరీ షెడ్డును భారీ పోలీస్ బందోబస్తుతో తొలగించారు. ఈ క్రమంలో  అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. రేకుల ప్రహరీ షెడ్ తొలగిస్తుండడంతో ఒక వర్గానికి చెందినవారు పెద్ద సంఖ్యలో  చేరుకుని.. రేకులను తొలగించొద్దని ఆందోళనకు దిగారు. 

©️ VIL Media Pvt Ltd.