Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా మహిళలలో క్యాన్సర్ లను నివారించే కార్యక్రమం మొదలు కానున్నది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మీర్ లో 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) టీకా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇది మహిళలలో నివారించగల క్యాన్సర్ లను తొలగించేందుకు భారతదేశం సాగించనున్న పోరాటానికి ఆరంభం కాగలదు. గర్భాశయ కేన్సర్ తో పాటు 6,11 రకాలకు కారణమయ్యే హెచ్ పివి రకాలు, 16,18 నుంచి రక్షణకల్పించే వాక్సిన్ ఇది. ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతున్న ఈ ప్రచారం లో భాగంగా క్వాడ్రివాలెంట్ హెచ్ పివి అయిన సింగిల్ షాట్ గార్డసిల్ 4 వాక్సిన్ (టీకా) ను ఇస్తారు.అజ్మీర్ లో ప్రధాని మోదీ హెచ్ పివి టీకా ప్రచారం ప్రారంభించే సమయంలోనే 14 ఏళ్లలోపు వయస్సుగల బాలికలందరికీ హెచ్ పివి టీకా ప్రచారాన్ని ఫిబ్రవరి 28నే ఉదయం 11.30 గంటలకు తాత్కాలికంగా ప్రారంభించాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 25 నే లేఖలు పంపింది.

ప్రధాని మోదీ అజ్మీర్ నుంచి హెచ్ పివి వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా అనుసంధానం చేస్తారు.మహిళలలో గర్భాశయ క్యాన్సర్ దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఆరోగ్యసమస్య. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) వల్ల వస్తుంది. టీకా ద్వారా నివారించగల ఏకైక క్యాన్సర్ ఇదే. గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడిఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 సంవత్సరాల లోపు వయస్సుగల బాలికలందరికీ ఒకే మోతాదులో గార్డిసిల్ 4 వాక్సిన్ వేయబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో, (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యునిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉపజిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు అస్పత్రులలో ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. హెచ్ పివి టీకా స్వచ్ఛందంగా అందజేస్తారు. బాలికలు టీకాలు వేసే ముందు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.