Reading Time: < 1 minute

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. గురువారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, కాంకేర్ జిల్లాలో ఏడు లక్షల రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు పార్టీకి చెందిన డి వి సి ఎం ( డివిజనల్ కమిటీ మెంబర్ ) సభ్యురాలు మాసే భార్ష కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేషా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టు 2003వ సంవత్సరం నుండి బస్తర్ దండకారణ్యం, అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలలో వివిధ హింసాత్మక సంఘటనలో చురుగ్గా పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందుగా ఈమె దండకారణ్యం నుండి చిద్బాంధర్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి జిల్లా ఎస్పీకి ఏకే 47 రైఫిల్ అందించి లొంగిపోయింది.