Reading Time: < 1 minute

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వారం రోజుల్లో శశికళ పార్టీ ఏర్పాటు కానుంది. ఓ వారం రోజుల్లో ఈ పార్టీ పేరు , ఇతర వివరాలను వెల్లడిస్తానని అన్నాడిఎంకె బహిష్కృత నాయకురాలు, జయలలిత నెచ్చెలి వికె శశికళ గురువారం చెన్నైలో తెలిపారు. ఇది ఆషామాషీ పార్టీ కాబోదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర వహించే పార్టీ కాగలదని స్పష్టం చేశారు. పార్టీని పెడుతానని ఇంతకు ముందే ఆమె ప్రకటించారు. తొమ్దిది సంవత్సరాల రాజకీయ అజాతం వీడారు. రెండు రోజుల క్రితం దివంగత జయలలిత 78వ జయంతి సందర్భంగా రామంతాపురం జిల్లాలోని కమూతి లో జరిగిన బహిరంగ సభలో కొత్త పార్టీ జెండా ఎగురేశారు. అక్కడి నుంచి గురువారం ఇక్కడికి వచ్చిన శశికళ చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నా, తమిళులే తన బలం అని, తాము ముందుకు వెళ్లుతానని స్పష్టం చేశారు.