
ప్రధాని మోడీ ఈ ఎగ్జిబిషన్‌లో పలు ఉపయుక్త సాధనాలను శ్రద్ధగా తిలకించారు. వాటి వివరాలను ఆసక్తితో తెలుసుకున్నారు. ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు రూపొందించిన మొబైల్ ఐ వివరాలను ఆరా తీశారు. ఇక వాటర్ జెన్ ద్వారా రూపొందించిన పరికరంతో గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతిక కీలకమైంది. గ్రావిటి ప్రాతిపదికన పనిచేసే ఎన్ డ్రిప్ ఇరిగేషన్ ప్రక్రియ, మైనోరా బయో కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాల సరైన నిర్వహణ మార్గాలను రూపొందించింది. ఇక సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ సాంకేతికత పలు వినూత్న రీతుల్లో సాగింది. లాబ్‌లో ఉత్పత్తి అయ్యే మిల్క్ ప్రొటిన్స్ , పలు రకాల పుట్టగొడుగుల తయారీ సాధనాలు ప్రధాని మోడీతో పాటు అందరినీ ఆకట్టుకున్నాయి. పంటనూర్పిళ్ల దశలో వృధాలు జరుగకుండా చేసే ప్రక్రియలు రైతాంగానికి ఉపయోగం కానున్నాయి.