Reading Time: < 1 minute

ఢిల్లీ: తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలుసుకోవాలని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి దుర్మార్గాలను రాహుల్ ఆపాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మట్లాడారు. రూ. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తుంటే పట్టించుకోవడం లేదని, ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చడాన్ని ఖండిస్తున్నామని తెలియజేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోమని, తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.