
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ ఓ 9 సంవత్సరాల బాలిక కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గోటన్‌కు చెందిన రాజేంద్ర బపేడియా యొక్క 9 సంవత్సరాల కుమార్తె దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుకుంటోంది. ఫిబ్రవరి 23న ఆ బాలిక ఎప్పటిలాగానే స్కూల్‌కి వచ్చింది. ఉదయం ప్రేయర్ సమయం ఉండటంతో తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్‌లో ఆడుకుంది. ఆ సమయంలో దివ్య ఉన్నట్టుండి పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. వైద్యులు పాప మృతి చెందినట్లు తెలిపారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. కార్డియాక్ అరెస్ట్ వల్లే ప్రాణాలు కోల్పోయింనది వైద్యులు పేర్కొన్నారు.