
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి తొలి వారంలో అతడి స్నేహితురాలు సానియా చందోక్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. అయితే వివాహ వేడుక సమీపిస్తున్న వేళ ప్రీ వెడ్డింగ్ సంబరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం నిర్వహించింది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ వేడుకల్లో నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకా, అనంత్, రాధికతో సహా అంబానీ కుటుంబ సభ్యులు, పలువరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. సచిన్, అంజలీ టెండూల్కర్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారిని తమ కుటుంబంలో ఒకరిగా పేర్కొన్నారు. అనంత్, రాధికల ప్రయాణం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అర్జున్ తమ స్కూల్‌లో చిన్న పిల్లాడిలా ఉన్నప్పటి నుంచి చూస్తున్నామని.. సానియా చుట్టూ పాజిటివిటీ ఉందన్నారు. వీరి జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలని ఆశీర్వదించారు.
We are touched by your kind gesture, Mukesh bhai, Nita bhabhi, Anant and Akash.
Moments like these feel even more meaningful when shared with family and friends who have been part of the journey. https://t.co/eCYxoRBTvH
— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2026