
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళగిరి షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ముందుగా షాప్ ముందు ఏర్పాటు చేసిన డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. షాపింగ్ మాల్ లో ఫర్నిచర్, వస్త్రాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. షాపులో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా హైడ్రా, ఫైర్ సిబ్బంది కాపాడారు. వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.