Reading Time: < 1 minute

హైదరాబాద్: భూమి సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదు.. రియల్ ఎస్టేట్ దందాకు వ్యతిరేకం అని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్టు అని విమర్శించారు. మన జాతి పిత మహాత్మ గాంధీ సరోవర్ పై తెలంగాణ బిజెపి పోరుబాట సాగింది. బాపుఘాట్ లో రామచందర్ నివాళులర్పించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులతో బిజెపి నేతలు ముచ్చటించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరిట రూ. 4 వేల కోట్ల అప్పు చేసిందని, పేదల ఇళ్లు జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చి బఫర్ జోన్ ను పెంచాల్సిన అవసరం లేదని, మూసీ బాధితులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు హామీ ఇచ్చారు.