Reading Time: < 1 minute

హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి జమ్ము కశ్మీర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. మూడో రోజు 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్ము జట్టు చివరకు 584 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్‌లో ఒక శతకం, ఐదు అర్థ శతకాలు నమోదు కావడం విశేషం. శుభమ్ పుందిర్(121) శతకం సాధించగా.. హసన్ (88), అబ్దుల్ సమాద్ (61), కన్హియా వాదవాన్ (70), సాహిలోత్రా(72), కెప్టెన్ పరాస్ డోగ్రా(70) పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలింగ్‌లో ప్రశిద్ధ్ కృష్ణ 5, విద్యాధర్, విజయ్ కుమార్, శ్రేయస్, శిఖర్ తలో వికెట్ తీశారు. కర్ణాటక ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మయాంక్ (16), దేవ్‌దత్(4) ఉన్నారు. కర్ణాటక ప్రస్తుతానికి 553 పరుగుల వెనుకంజలో ఉంది.