Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలకంతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది కివీస్ జట్టు.. మరోవైపు శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో 84 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును కెప్టెన్ మిచెల్ శాంట్నర్(47), కోల్ మెక్‌కోంచి(31 నాటౌట్) వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కి 84 పరుగులు జత చేశారు. దీంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ క్రమంలో శాంట్నర్-మెక్‌కోంచిల జోడి ఓ ప్రపంచకప్ రికార్డును బద్దలు కొట్టింది. టి-20 ప్రపంచకప్‌లో ఏడో వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ జోడీ స్టీవ్ స్మిత్, మైక్ హస్సీలు కలిసి 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై 74 పరుగులు జత చేశారు. ఇప్పుడు ఈ రికార్డును శాంట్నర్-మెక్‌కోంచిలు బద్దలుకొట్టారు.