Reading Time: 2 minutes

హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్‌కు – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కిమ్స్ యూనిట్‌తో పాటు సిఎస్ఆర్‌గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్‌కి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్. శ్రీధర్‌కు.. ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అంతేకాక బిసి వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత అందించారు. ఇ. శ్రీధర్‌కు.. ఇరిగేషన్ మరియు సిఎడి శాఖ కార్యదర్శిగా నియమించారు. గౌరవ్ ఉప్పల్‌ను ఫైనాన్స్ మరియు ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. టిజిఆర్‌ఎసి ఇవొ డిజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇతర కీలక పోస్టింగ్‌లు

బి. విజయేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం.

డి. దివ్య – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత.

అద్వైత్ కుమార్ – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం.

ఎం. హనుమంత రావు – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ. సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం.

సందీప్ కుమార్ ఝా – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం.

ఎండి. ముషారఫ్ అలీ ఫరూఖీ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ.

పామెల సంపత్ – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ.

అనురాగ్ జయంతి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం.

రాహుల్ రాజ్ పి.ఎస్ – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం.

భవేశ్ మిశ్రా – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.

కొత్త జిల్లా కలెక్టర్లు

జితేష్ వి పాటిల్ – టిజిఎస్పిడిసిఎల్ సిఎండిగా నియామకం.

రిజ్వాన్ భాషా షేక్ – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ.

సంతోష్ బి.ఎం– జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ.

ప్రతీక్ జైన్ – వికారాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం.

స్నేహ శబరీష్ – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ.

పి. కాత్యాయనీ దేవి – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం.

జి.ఫణీంద్ర రెడ్డి – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ.

చిత్ర మిశ్రా – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం.

గరీమా అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం.

దీపక్ తివారీ – వికారాబాద్ కలెక్టర్‌గా నియామకం.

ప్రతీమా సింగ్ – మెదక్ కలెక్టర్‌గా నియామకం.

అంకిత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం.

చాహత్ బాజ్‌పేయ్– హనుమకొండ కలెక్టర్‌గా నియామకం; జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత.

ఖుష్బు గుప్త– మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం.

ఇతర పోస్టింగ్‌లు

మంద మకరందు – జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్.

ఫైజన్ అహ్మద్– మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్.

శివేంద్ర ప్రతాప్ – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్.

పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ – జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్.

ఉమా శంకర్ ప్రసాద్ – వికారాబాద్ అదనపు కలెక్టర్.

రాష్ట్ర సర్వీస్ (ఎస్‌సిఎస్) అధికారుల పోస్టింగ్‌లు

జి.వి శ్యాంప్రసాద్ లాల్– నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్.

పి.చంద్రయ్య – మంచిర్యాల అదనపు కలెక్టర్.

వై.వి గణేశ్– వరంగల్ అదనపు కలెక్టర్. అబ్దుల్ హమీద్ – సిద్ధిపేట అదనపు కలెక్టర్.

బి. వెంకటేశ్వరు– నిర్మల్ అదనపు కలెక్టర్.

ఎన్.ఖీమ్య నాయక్ – వనపర్తి అదనపు కలెక్టర్.

ఇతరులు

కె.విద్యాసాగర్ – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం.

ఎం.సురేందర్ – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం.

 మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.