Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సిఎస్, డిజిపిలు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్ష్‌గా మారింది. ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల 31వ తేదీతో పూర్తి కానుండగా, ఇన్‌చార్జీ డిజిపి శివధర్‌రెడ్డిది ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తమకే ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని ప్రస్తుత సిఎ స్, డిజిపిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. అయితే, వారికి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకుండా తమకు ఈ పదవులు కేటాయించాలని సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్‌లు ప్రభుత్వానికి విన్నవించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహులు ఈ పదవులను దక్కించునేలా తమవంతు ప్రయత్నా లు చేస్తున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 30వ తేదీన రామకృష్ణారావు సిఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగష్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీస్‌ను ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31వ తేదీ తో ముగియనుంది. ఇప్పటికే రామకృష్ణారావుకు ఒకసారి ఏడునెలలు సర్వీస్ పొడిగింపును ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పెంచే అవకాశాలు లేవని సీనియర్ ఐఏఎస్‌లు పేర్కొంటుండడంతో సిఎస్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, మరికొందరు ఐఏఎస్‌లు మాత్రం ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారా వు పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక కొత్తవారిని ఎంపిక చేస్తారా? అ న్న విషయం త్వరలో తేలనుంది. అయితే, సిఎస్ రామకృష్ణారావు పదవీ పొడిగింపుపై కేంద్రం నుంచి సానుకూలత రాకుంటే ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్‌లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు సిఎస్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది.

మరికొందరు ఆ పదవిని తమకే ఇవ్వాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ సిఎస్‌లు జయేశ్ రంజన్, సభ్యసాచి ఘోష్, వికాస్‌రాజ్‌లు సిఎస్‌లుగా రేసులో ఉండగా ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్న సంజయ్‌జాజు కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.1992 బ్యాచ్‌కు చెందిన వికాస్‌రాజ్, జయేశ్ రంజన్‌లతో పాటు 1994 బ్యాచ్ అధికారి సవ్యసాది ఘోష్ పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. ఇక, జయేశ్ రంజన్ 2027 సెప్టెంబర్‌లో, సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. వికాస్ రాజ్‌కు 2028 మార్చి వరకు సర్వీస్ ఉంది. ఇక, వీరితో పాటు ఐఏఎస్‌ల్లో అత్యంత సీనియర్ అయిన 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్ ఈ ఏడాది తరువాయి 9లో