
మన తెలంగాణ/హైదరాబాద్ :మావోయిస్టు పా ర్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాటుకు రంగం సిద్దమయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ వర్గాల కథనం ప్రకారం రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీలో కీలక అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్ లొంగిపోవడంతో ఇక ఆ పార్టీ నుంచి మిగిలిన పెద్దతలకాయ గణపతి ఒక్కరే. ఈయన కూడా పోలీసులకు లొంగిపోతే మావోయిస్టు పార్టీని తు డిచిపెట్టినట్టు అవుతోందని కేంద్ర ప్రభుత్వ యో చిస్తోన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో గణపతి ఆచూకీ కోసం గత కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్రా ల ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా గాలిస్తోన్న ట్టు ఈ వర్గాల సమాచారం. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల నుంచి సేకరించిన సమాచారంతో గణపతి పొరుగు దేశం నేపాల్‌లో తలదాచుకున్నట్టు ఇంటెలిజన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అక్కడ ఒక ఆశ్రమంలో అజ్ఞాత జీవితం గడుపుతన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు చెబుతున్నా రు.
అక్కడి నుంచి గణపతిని భారత్‌కు తీసుకవచ్చేందుకు కేంద్ర హోం శాఖ నేపాల్ ప్రభుత్వం తో రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. అ యితే గణపతి కేంద్ర హోం శాఖ అధికారుల ఎ దుట లొంగిపోతారా? లేక తెలంగాణ పోలీసుల వద్ద లొంగిపోతారా? అనే దానిపై స్పష్టత రావా ల్సి ఉందని కూడా చెబుతున్నారు. ఇలా ఉండ గా, గణపతి 2018లో పార్టీకి రాజీనామా చేసి బ యటకు వచ్చారు. అప్పటి నుండి వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ప్రస్తుతం ఆయ న అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయిన స్థితిలో ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వ ర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితిపై కూడా ఆయనకు సమాచారం లేదని వారు అంటున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టా ఎలాంటి హాని కలిగించబోమన్న హామీతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతోన్నట్టు సమాచారం. ఈ వర్గాల కథనం ప్రకారం గణపతి కూడా రాష్ట్ర పోలీసుల వద్ద లొంగిపోవడానికే మొగ్గు చూపుతునట్లు తెలిసింది. ఈ వర్గాల సమాచారం ప్రకారం గణపతి లొంగుబాటుకు రంగం సిద్దం అయిందని కచ్చితంగా చెబుతున్నారు.