Reading Time: < 1 minute

ఇజ్రాయెల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పై పాకిస్తాన్ ఉలికిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో పొత్తుల షడ్బుజి కోసం చేసిన వాదనపై పాక్ తీవ్రంగా స్పందించింది. దీనిని ముస్లీం వ్యతిరేక ఉమ్మా కూటమిగా అభివర్ణించింది. ఇస్లామిక్ దేశాల రాడికల్ షియా అక్షం ను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇతర దేశాలతో పొత్తు పెట్టుకోవాలనే నెతాన్యాహు ప్రణాళికను ఖండిస్తూ, పాకిస్తాన్ సెనెట్ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాక్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అన్నిరాజకీయ పార్టీల తరుపున పిపిపి సభ్యుడు పల్వాషా మొహమ్మద్ జైఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.