Reading Time: < 1 minute

రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయింటింగ్‌లో ఉన్న అదనపు కలెక్టర్ జి. పద్మజారాణిని గద్వాల జిల్లా డీఆర్వోగా, మేడ్చల్ డీఆర్వో హరిప్రియను మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా, శేరిలింగం పల్లి డిప్యూటీ కలెక్టర్ కె.వెంకారెడ్డిని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా, మెదక్ డీఆర్వో డి.భుజంగరావును ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా, సీసీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్‌గా, గద్వాల హౌజింగ్ బోర్డు పీడీ టి.శ్రీనివాసరావును గద్వాల ఆర్డీవోగా, గద్వాల ఆర్డీవో ఎల్.అలివేలును గద్వాల హౌజింగ్ పీడీగా, సీసీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ పి.రామకృష్ణను నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.

ఇక ఎల్లారెడ్డి ఆర్డీవో కె.పార్థసింహారెడ్డిని చేవెళ్ల ఆర్డీవోగా, నర్సాపూర్ ఆర్డీవో కె.మహిపాల్ రెడ్డిని శేరిలింగంపల్లి తహశీల్దార్‌గా, మెట్‌పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్‌ను ఖమ్మం ఆర్డీవోగా, ఖమ్మం ఆర్డీవో జి.నర్సింహారావును మెట్‌పల్లి ఆర్డీవోగా, వెయింటింగ్‌లో ఉన్న పి.మాధవి దేవిని నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పీఏగా, డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన ప్రభాకర్ రొద్దను ఎల్లారెడ్డి ఆర్డీవోగా, డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఎడ్లను కుడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ వి.అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.