Reading Time: 2 minutes
Prayagraj Sangam Underground River Saraswati Ngri Research

Saraswati river: ‘‘సరస్వతి నది’’, పూర్వకాలం భారతదేశంలో ప్రవహించిన పవిత్ర నదిగా పేరుంది. రుగ్వేదంలో సరస్వతి ప్రస్తావన ఉంది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవిస్తుందని హిందువుల నమ్మకం. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజ్‌లో గంగా, యమున సంగమ ప్రదేశాన్ని ‘‘త్రివేణి సంగమం’’ గా భావిస్తారు. ఇదే చోట ‘‘సరస్వతి నది’’ కూడా ఈ రెండు నదులతో కలుస్తుందని హిందువుల నమ్మకం.

అయితే, ఈ నమ్మకానికి బలమైన శాస్త్రీయ ఆధారాలను హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు గుర్తించారు. గంగా-యమునా నదుల మధ్య ఒకప్పుడు భూగర్బంలో ఒక విశాలమైన ప్రాచీన నది(పాలియోరివర్) ప్రవేశించేదని ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించి కనుగొన్నారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే ‘‘సరస్వతి’’ నది నిజంగా ప్రవహించిందని నమ్ముతున్నవారికి ఇది ఒక శాస్త్రీయ ఆధారాన్ని అందిస్తుంది.

Read Also: The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!

ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలు హెలికాప్టర్ సర్వేలు, డ్రిల్లింగ్‌ను (బోరింగ్) ఉపయోగించారు. డాక్టర్ సుభాష్ చంద్ర బృందం గంగా -యమునా దోఆబ్ ప్రాంతంలో భూమికి 10-15 మీటర్ల దిగువన ఒక పెద్ద నదీ లోయను కనుగొంది. ఈ ఆవిష్కరణ పూర్తిగా నిర్ధారించబడిందని ఆయన తెలిపారు. డ్రిల్లింగ్ ద్వారా శాస్త్రీయ ఆధారాలు పొందినట్లు చెప్పారు.

భూగర్భ నది లేదా పురాతన నదీమార్గం 4-5 కిలోమీటర్ల వెడల్పుతో దాదాపు గంగా, యమున నదులంతా పెద్దదిగా ఉండేదని తేలింది. దీని లోతు కూడా రెండు నదుల మాదిరిగానే ఉండేదని, ఇది గంగా-యమునా నదుల పాత ప్రవాహ మార్గం కాదని, ఇది ఒక ప్రత్యేక నదికి సంబంధించినదిగా తేలింది. ఈ నది గంగా-యమునాల పక్కనే ప్రవిస్తోందని తెలిసింది. మొదట్లో 45 కిలోమీటర్లుగా దీని పొడవును అంచనా వేస్తే, ప్రస్తుతం దీని పొడవు కాన్పూర్ వరకు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటం సైంటిస్టుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పశ్చిమ దిశగా హిమాలయాల వరకు మరింతగా విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

సంగమ స్థలంగా భావిస్తున్న ప్రాంతం నుంచి 25 కి.మీ వరకు శాస్త్రవేత్తలు నదిని స్పష్టంగా గుర్తించారు. అయితే, జనాభా విస్తరణ, భవనాల కారణంగా సర్వే చేయడం కష్టంగా మారింది. ఈ ప్రాచీన నది సరస్వతీ నది వర్ణనలతో సరిగ్గా సరిపోతుంది. తాజా పరిశోధనల్ని బట్టి చూస్తే కాలక్రమంలో ఒక పెద్ద నది భూగర్భంలో కలిసిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది.