
హైదరాబాద్: భర్త, ఏడేళ్ల కుమారుడిని వదిలి ప్రియుడిని ప్రియురాలు పెళ్లి చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం హాసన జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హాసన్ ప్రాంతంలో ప్రకాశ్ అనే వ్యక్తి 2018లో హర్షిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. తన ఆరోగ్య బాగోలేదని మార్చి 30న ఇంట్లో నుంచి హర్షిత ఆస్పత్రికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో అత్తారింటికి అల్లుడు సమాచారం ఇవ్వడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రియుడు సచిన్, హర్షితను పిఎస్‌కు తీసుకొచ్చారు. తనకు భర్త, కుమారుడు వద్దని, ప్రియుడితో ఉండిపోతానని స్పష్టం చేసింది. ప్రియుడు సచిన్‌ను కారులో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుట్టింటికి, అత్తింటికి వెళ్లనని చెప్పడంతో ఆమెను సర్కారు మహిళా సాంత్వన కేంద్రానికి పోలీసులు తరలించారు.