Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) కార్మిక సంఘాలు ప్రేరేపిత సమ్మెకు వెళ్లవద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల కు విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి ఇ ప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పరిస్థితుల్లో ఇ బ్బందులకు గురి చేయవద్దని కోరారు. పెం డింగ్ డీఏ ను ఇప్పటికే విడుదల చేశామని, పీఆర్సీపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామని, ప్రస్తుతం కమిటీ వద్ద ఈ రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. ఈ రెం డు ప్రధాన సమస్యలు మినహా మిగతా అం శాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సిబ్బందికి సంబంధించిన ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాల గోడపత్రికను మంత్రి పొన్నం సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్ర త్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్ రా జ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, రవాణా శాఖ జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లిం గయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, తొందర పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీసుకున్న సమ్మె ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు.

13 నుంచి 18 వరకు

రోడ్డు భద్రతపై అవగాహన

ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తం గా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ల క్ష్యంతో పోలీస్, రవాణా శాఖలు కలిసి అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తె లిపారు. రవాణా నిబంధనలు, రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలపై చర్చించి, వా టిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రోడ్డు ప్ర మాదాలను తగ్గించే చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.